'పేపర్ బాయ్' టీజర్
- July 20, 2018
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం పేపర్ బాయ్. యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రియా సుమన్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. జయశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.
తాజగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈ చిత్రాన్ని రొమాంటిక్ ప్రేమకథగా ప్రతి ప్రేముని అందంగా మలచినట్లు టీజర్ ద్వారా స్పష్టం అవుతోంది. సంతోష్ శోభన్ న్యూస్ పేపర్లు వేసే పేపర్ బాయ్ గా నటిస్తున్నాడు. తాను పేపర్ వేసే ఓ ఇంట్లో అమ్మాయిని చూసి ప్రేమించే కథగా ఈ చిత్రం రానుంది.
హీరోయిన్ రియా సుమన్ గ్లామర్ ఈ చిత్రం ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. రియా సుమన్ టీజర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. బిటెక్ చదివి పేపర్స్ వేస్తున్నావా.. అది బ్రతకడానికి, ఇది భవిష్యత్తు కోసం అంటూ హీరో హీరోయిన్ మధ్య సాంగ్ సంభాషణ బావుంది. మొత్తంగా పేపర్ బాయ్ టీజర్ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







