హల్క్ ఖాన్ ఫ్రమ్ పాకిస్థాన్
- July 20, 2018
హాలీవుడ్ సూపర్ హీరో హల్క్ పేరు వినగానే ఆకుపచ్చని రంగులో కండలు తిరిగిన భారీ శరీరం కళ్ల ముందు కదలాడుతుంది. ఇక హల్క్ సినిమా చూసిన వాళ్లకైతే అతని రెండు లక్షణాలు చట్టుక్కున గుర్తొస్తాయి. మొదటిది ముక్కు మీద కోపం, రెండోది కొండలు పిండి చేయగల బలం. హల్క్ లోని ఈ లక్షణాలన్నీ తనలోనూ ఉన్నాయంటాడు పాకిస్థాన్ లోని ఓ వ్యక్తి. తనను తాను పాకిస్థానీ హల్క్ గా చెప్పుకొంటాడు. తాడు కట్టి కారు, ట్రాక్టర్ వంటి వాటిని బొమ్మలను లాగినట్టు లాగేస్తాడు. ఎంత బరువైన మోటార్ సైకిల్ నైనా ఒంటిచేత్తో ఎత్తేస్తాడు.
పొరుగున ఉన్న పాకిస్థాన్ లో మర్దాన్ అనే పట్టణం ఉంది. ఇక్కడే ఉంటాడు అర్బబ్ ఖిజర్ హయత్. ఈ పాతికేళ్ల కుర్రాడి గురించి స్థానికులెవరినైనా అడిగితే ఏమో తెలియదని చెబుతారు. అదే ఖాన్ బాబా అనగానే ఇంటి దగ్గర దిగబెడతారు. అంత పాపులర్ ఈ సింహబలుడు. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 436 కిలోల బరువుతో కదిలే పర్వతం మాదిరిగా కనిపిస్తాడు. స్వదేశంలో తనంత బలశాలి లేడని చెబుతాడు ఖాన్ బాబా. అందుకే తనను తాను పాకిస్థానీ హల్క్ గా పరిచయం చేసుకుంటాడు. ఉత్త చేతుల్తో మోటార్ సైకిల్, కార్, ట్రాక్టర్.. ఏ వాహనాన్నైనా కదలకుండా నిలబెట్టేస్తాడు.18 ఏళ్ల వయసులో ఉండగా అర్బబ్ తనబరువు పెరుగుతున్నట్టు గుర్తించాడు. ఆ పెరుగుదల పదుల నుంచి వందల కిలోలకి చేరింది. ఇప్పటి బరువుకే జనం బాబోయే అనుకుంటే అదే తన బలం అనుకుంటాడీ ఖాన్. మరికొన్ని కిలోలు బరువు పెరగాలనుకుంటున్నాడు. ఇక ఈయన తిండి చూస్తే ఎవరైనా బాబోయ్ అనాల్సిందే. రోజుకు 10,000 కేలరీల ఆహారం తింటాడు. 36 గుడ్లు, 4 కిలోల మాంసం తిని హరాయించుకుంటాడు. ఇవి కాకుండా 5 లీటర్ల పాలు రోజూ తాగాల్సిందే. టీవీల్లో చూపించే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ లో పాల్గొని ప్రపంచమంతా ఫేమస్ అవ్వాలనుకుంటున్నాడీ మహాబలుడు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







