కొత్త చిత్రం షూటింగ్ షురూ చేయనున్న ప్రభాస్
- July 22, 2018
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తి స్థాయి ప్రేమ కథాంశంతో రానున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్ సొంత బ్యానర్ గోపి కృష్ణ మూవీస్‌లో ఈ జాయింట్ వెంచర్ తెరకెక్కనుంది. ఈ సినిమాను కృష్ణం రాజు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ కొండలనెక్కనున్నాడని టాక్. హీరోయిన్ కోసం కొండకోనల్లో అన్వేషణ చేస్తూ ఆయన ముందుకే సాగే సన్నివేశాలు వుంటాయనీ.. ఇవే సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాల సమాచారం. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూరప్‌లో ప్లాన్ చేశారు. ఇందులో ప్రభాస్ ఆస్ట్రాలజిస్ట్‌గా కనిపిస్తారని టాక్. 2019 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కుతోంది.
కాగా ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్ హైదరాబాద్‌లో నిర్విరామంగా జరుగుతున్న విషయం తెలిసిందే! సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తుంది. 'సాహో' షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అయ్యింది. కానీ ఈ సినిమా రిలీజ్‌కు మరికొంత సమయం పడుతుందని సమాచారం. పైగా ఈ సినిమాలో గ్రాఫికల్ వర్క్స్ ఎక్కువగా ఉందట. దీంతో ఆగస్టులో రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా లాంచ్ చెయ్యడానికి రెడీ అయిపోయాడు డార్లింగ్ 'ప్రభాస్'.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







