త్వరలో మొదలుకానున్న 'వెంకీమామ' ఫస్ట్ షెడ్యూల్

- July 22, 2018 , by Maagulf
త్వరలో మొదలుకానున్న 'వెంకీమామ' ఫస్ట్ షెడ్యూల్

వెంకటేష్ , నాగ చైతన్య కలిసి బాబీ దర్శకత్వం లో వెంకీమామ అనే టైటిల్ తో ఓ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇటీవలే ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను కొన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ మూవీ మొదటి షెడ్యూల్ ను ఆగష్టు 8 నుండి హైదరాబాద్లో మొదలు పెట్టుకోబోతుంది.

ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీతీ సింగ్ జోడి కడుతుండగా , వెంకీ జోడీగా కాలా ఫేమ్ హ్యూమా ఖురేషి జోడి కడుతుంది. ఈ క్రేజీ మల్టీస్టార్ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడు. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. జనవరి లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే శైలజ రెడ్డి అల్లుడు తో ఆగస్టు 31 న రాబోతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com