అమెరికాలో కాల్పుల కలకలం
- July 21, 2018లాస్ ఏంజిల్స్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. లాస్ ఏంజెల్స్‌లోని ట్రేడర్ జోయ్స్ స్టోర్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒక యువతి మృతి చెందారు. అనంతరం స్టోర్‌లోని పలువురిని బందీగా చేసుకొని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి సాయుధుడిని అరెస్టు చేసి.. స్టోర్‌లోని బందీలను విడిపించారు. కాల్పులకు తెగబడిన యువకుడి వయస్సు 28 సంవత్సరాలు ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రియురాలిపై కోపంతోనే అతను కాల్పులకు దిగాడని, ఈ కాల్పుల్లో అతని ప్రియురాలు మృతిచెందిందని కథనాలు వచ్చాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు