విడుదలైన సమంత "యూ టర్న్" ఫస్ట్ లుక్
- July 22, 2018
వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం "యూ టర్న్" ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు. "రంగస్థలం, అభిమన్యుడు, మహానటి" చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకోవడంతోపాటు.. నటిగా తన స్థాయిని పెంచుకొన్న సమంత "యూ టర్న్"తో తన నటవిశ్వరూపం చూపనుంది.
ఆమె ఇంటెన్స్ లుక్స్, సబ్టుల్ పెర్ఫార్మెన్స్ "యూ టర్న్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలవ్వగా.. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. సమంత వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు.
తారాగణం:
సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు..
సాంకేతికవర్గం:
కథ-దర్శకత్వం: పవన్ కుమార్
నిర్మాతలు; శ్రీనివాస చిట్టూరి-రాంబాబు బండారు
నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
కళ: ఏ.ఎస్.ప్రకాష్
కూర్పు: సురేష్ అరుముగమ్
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







