కేటీఆర్‌కు మరో ప్రఖ్యాత ఆహ్వానం
- July 22, 2018
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరొక ప్రఖ్యాత ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న " గ్లోబల్ క్లైమెట్ యాక్షన్ సమ్మిట్" సదస్సులో ప్రసంగించాలని కేటీ రామారావుకి ఆహ్వానం అందింది. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ మంత్రికి లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొని " ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్" అనే అంశంపైన ప్రసంగించాలని కేటీఆర్ గవర్నర్ కోరడం జరిగింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు వాతావరణ మార్పులకు ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాలపై చేసే ప్రసంగం ఉపయుక్తంగా ఉంటుందని గవర్నర్ తెలిపారు.
ఈ ప్రసంగంలో.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతోపాటు భవిష్యత్తు చేపట్టబోయే కార్యక్రమాలను వాతావరణ అనుకూల కార్యక్రమాల పై కూడా వివరించాలని ఆయన లేఖలో కోరారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు పైన చైతన్యవంతం చేసే దిశగా ఈ సదస్సు ఉంటుంది. ఈ సదస్సు ద్వారా వివిధ ప్రభుత్వాలను, పాలసీ మేకర్స్‌ను సానుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాల నుంచి ప్రతినిధులతో పాటు వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న కీలకమైన వ్యక్తులు హాజరవుతారని మంత్రికి పంపిన ఆహ్వానంలో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







