చై-సామ్ సినిమా షురూ
- July 22, 2018
చై-సామ్ సినిమా మొదలైంది అతిథిగా విచ్చేసిన నాగార్జున హైదరాబాద్: ఎనిమిదేళ్ల క్రితం అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా 'ఏమాయ చేశావె' సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. 2017లో వీరిద్దరూ వివాహబంధంతో ఒకటయ్యారు. మధ్యలో 'మనం', 'ఆటోనగర్ సూర్య' సినిమాల్లోనూ జంటగా నటించారు. అయితే పెళ్లయ్యాక చై, సామ్‌లు కలిసి ఎప్పుడు నటిస్తారా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వారి ఆశ నెరవేరింది. శివ నిర్వాణ ఈ జంట కోసం ఓ కథను సిద్ధం చేశారు. కాగా..ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సమంతతో పాటు నాగార్జున కూడా వచ్చారు. ఈరోజు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి కానీ ఆగస్ట్ నుంచి చిత్రీకరణ మొదలు కానుందని సమంత వెల్లడించారు. ఇందులో చై, సామ్ భార్యాభర్తల పాత్రల్లోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. సాహి గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. వినోదాత్మక ప్రేమకథా చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పెళ్లయ్యాక భార్యభర్తల మధ్య చోటుచేసుకునే చిలిపి తగాదాలు, వాళ్ల అనుబంధం నేపథ్యంలో సాగబోతోంది. మరోపక్క చైతూ 'సవ్యసాచి', 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు.
సమంత 'యూటర్న్' చిత్రంలో నటిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







