ఆందోళనకరంగా మారిన షరీఫ్ ఆరోగ్యం

- July 22, 2018 , by Maagulf
ఆందోళనకరంగా మారిన షరీఫ్ ఆరోగ్యం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉందని, వెంటనే అతన్ని చికిత్స కొరకు హాస్పిటల్‌కు తరలించాలని జైలు వైద్య సిబ్బంది తెలిపారు. పనామా పత్రాలు కుంభకోణం కేసులో ఈ నెల 13న అరెస్ట్‌ అయిన షరీఫ్‌ ప్రస్తుతం అదీలా జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. జైలు వైద్య సిబ్బంది ఆదివారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన ఆనంతరం షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు.

డీహైడ్రేషన్‌, రక్తహీనత ప్రమాదకర స్థాయికి పెరిగాయని, మరింత ఆలస్యం చేస్తే హార్ట్‌ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ​పనామా పత్రాల కుంభకోణం కేసులో షరీఫ్‌, ఆయన కుమార్తె మరియమ్‌ లండన్‌ నుంచి పాక్‌ వచ్చిన వెంటనే లాహోర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విధితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com