ఈ నెల 29న 'గీత గోవిందం' ఆడియో విడుదల
- July 26, 2018
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న జంటగా సోలో ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో రాబోతున్న చిత్రం గీత గోవిందం. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఓ రేంజ్ పెరిగిందనడానికి ఇటీవల వచ్చిన గీత గోవిందం టీజర్స్ కు వ్యూస్ చెపుతున్నాయి. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణం లో ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఈ ఆడియో వేడుకకు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఈ చిత్రానికి గోపిసుందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇంకేం కావాలి అంటూ గోపీసుందర్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోయింది. దీంతో గీత గోవిందం సాంగ్స్ అదిరిపోయాయని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు నటిస్తుండగా, శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ తర్వాత పరుశురాం నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.
ప్రొడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA2 PICTURES బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







