అల్ రయ్యాన్‌లో వకూద్ కొత్త సర్వీస్ స్టేషన్
- December 13, 2015
ఖతార్ ఫ్యూయల్ (వకూద్) తన 30వ సర్వీస్ స్టేషన్‌ని ప్రారంభించింది. ఖతార్ ఇందధన అవసరాల్ని తీర్చేందుకు ఈ కొత్త స్టేషన్ ఉపకరిస్తుందని ఖతార్ ఫ్యూయల్ వెల్లడించింది. దోహాలని అల్ రయ్యాన్ ప్రాంతంలో వకూద్ సీఈఓ ఇంజనీర్ ఇబ్రహీమ్ జహామ్ అల్ కువారి ఈ కొత్త స్టేషన్‌ని ప్రారంభించారు. ఖతార్ బిజినెస్ సెక్టార్ నుంచి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 20 మిలియన్ ఖతార్ రియాల్స్ వెచ్చించి ప్రారంభించిన ఆరువేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని కవర్ చేసే ఈ కొత్త స్టేషన్ న్యూ రయ్యాన్, రయ్యాన్, వజ్బా, ద ఘర్రాఫా ఏరియా మరియు ఖతార్ ఫౌండేషన్ కమ్యూనిటీకి ఉపకరిస్తుంది. ఈ సంవత్సరం వకూద్ నుంచి అల్ రయ్యాన్ బిన్ డెర్హామ్, అల్ వక్రా, వజ్బా, అల్ థఖిరా మరియు లిజిమిలియా తదతర ఏడు స్టేషన్లు ప్రారంభమయ్యాయి. 2016లో మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని వకూద్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







