ఒమన్‌లో ఇ-సిగరెట్స్, ఇ-సిషాపై నిషేధం
- December 13, 2015
ఎలక్ట్రానిక్ సిగరెట్లు మరియు ఎలక్ట్రానిక్ సిషా (హుక్కా)లపై బ్యాన్ విధించబడింది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాటరీ ఆధారిత ఈ సిగరెట్ నికోటిన్ వ్యాపర్‌ని విడుదల చేస్తుంది. సంప్రదాయ సిగరెట్ బానిసలైనవారు, దాని నుంచి దూరంగా ఉండేందుకు ఇ-సిగరెట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే వీటి ద్వారా సిగరెట్ స్మోకింగ్‌ని విడిచిపెడుతున్నారనడానికి సరైన ఆధారాల్లేనందున ఇ-సిగరెట్లపై బ్యాన్ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దుకాణాల్లో ఎక్కడా ఇ-సిగార్లు అందుబాటులో ఉంచకూడదని వ్యాపారులకు అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించినవారికి 500 ఒమన్ రియాల్స్ ఫైన్ విధించబడుతుంది. నిబంధనల ఉల్లంఘన రిపీట్ అయితే ఫైన్ రెట్టింపు అవుతుంది. ఇ-సిగార్ ఉపయోగించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ జవాద్ అహ్మద్ అల్ లవాతి చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







