పచ్చిమామిడి కాయను తరచుగా తీసుకుంటే?
- July 28, 2018
పచ్చిమామిడికాయలు విరివిగా దొరికే కాలమిది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గాను, కూరల్లో గాను చేర్చి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
ఎసిడిటీ వలన ఛాతీలో మంటతో కూడిన నొప్పి వస్తుంది. అలాంటప్పుడు పచ్చిమామిడికాయ ముక్కని సన్నగా తరిగి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.గర్భిణులకు వాంతులు, వికారం వలన అసౌకర్యంగా ఉంటుంది. వారు పచ్చిమామిడి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
చాలామందికి మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తరువాత బద్దకంగా అనిపిస్తుంది. అలాంటి వారు పచ్చిమామిడిని తీసుకుంటే చురుగ్గా ఉంటారు. పచ్చిమామిడి తినడం వలన ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. పుల్లటి మామిడి ముక్కల్లో ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాలను దూరం చేసే గుణం ఉంటుంది.
శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు కొత్త రక్తకణాల నిర్మాణానికి దోహదపడుతుంది. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, రక్తం కారడం, పన్ను నొప్పి వంటివి దూరం కావాలంటే మామిడి ముక్కను నమలాలి. దాంతో బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దంతాలు శుభ్రపడుతాయి. పళ్ల మీద ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది. నోటి దుర్వాసనలు దూరమవుతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







