ఈజిప్ట్‌:75 మందికి మరణశిక్ష

- July 28, 2018 , by Maagulf
ఈజిప్ట్‌:75 మందికి మరణశిక్ష

ఈజిప్ట్‌లో 75 మందికి మరణశిక్ష కైరో: ఐదేళ్ల నాటి కేసుకు సంబంధించి 75 మందికి మరణశిక్ష విధిస్తూ ఈజిప్ట్‌లో ఒక కోర్టు తీర్పు చెప్పింది. వీరిలో నిషిద్ధ 'ముస్లిం బ్రదర్‌హుడ్‌' ముఠా అగ్రనేతలు కూడా ఉన్నారు. ఈ తీర్పును ఈజిప్ట్‌ అత్యున్నత ఆధ్యాత్మిక పీఠం 'గ్రాండ్‌ ముఫ్తి'కి కోర్టు నివేదిస్తుంది. సాధారణంగా కోర్టు నిర్ణయానికి అక్కడ సమ్మతి లభిస్తుంటుంది. ఈ కేసులో మరో 660 మందికి సెప్టెంబర్‌ 8న శిక్ష ఖరారు చేయనున్నారు. 2013లో నాటి అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సి పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. దీంతో సైన్యం ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఈ నేపథ్యంలో మోర్సి మద్దతుదారులు ధర్నాకు దిగారు. ఇది హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు వీరిని చెదరగొట్టాయి. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు శిక్ష పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com