కమల్ విశ్వరూపం 2 ట్రైలర్
- July 29, 2018
విశ్వనటుడు హీరో కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన 'విశ్వరూపం' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆగస్ట్ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మరో కొత్త టీజర్‌ని కమల్ రిలీజ్ చేశారు.. విశ్వరూపం 2 మొదటి భాగానికి కొనసాగింపుగా ఉండే స్పై త్రిల్లర్. పూర్తిగా తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కినది. ఇండియా- పాక్ ని విభజించిన మతం అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ వెల్లడించాడు. కాగా, ఆస్కార్ ఫిలిం (ప్రై) లిమిటెడ్ వి.రవిచంద్రన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో, హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆస్కార్ ఫిలింస్ వి.రవిచంద్రన్ తెలిపారు.
కమల్‌హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, వహీదా రెహమాన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మహమ్మద్ గిబ్రాన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: శామ్‌దత్, షైనుదీన్, షను జాన్ వర్గీస్, ఎడిటింగ్: మహేష్ నారాయణన్, విజయ్ శంకర్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, నిర్మాతలు: ఎస్.చంద్రహాసన్, కమల్‌హాసన్, రచన, దర్శకత్వం: కమల్‌హాసన్.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







