నైట్ షూటింగ్ లో నాగార్జున,నానీల దేవదాస్
- July 29, 2018
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న మల్టీ స్టారర్ దేవదాస్.. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.తాజాగా ఈ మూవీ షూటింగ్ రాత్రి సమయాల్లో హైదరాబాద్ లో కొనసాగిస్తున్నారు.. ఈ షూటింగ్ వర్కింగ్ స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. . దేవ అనే పాత్రలో డాన్‌గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్‌గా నాని కనిపించనున్నారు. ఈ మూవీ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







