ఆగస్ట్ తొలివారం నుంచి వెంకటేష్ రెగ్యూలర్ షూటింగ్..
- July 30, 2018
వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'వెంకీ మామ' చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 8 నుంచి జరుగుతుంది.
ప్రేమమ్ చిత్రంలో నాగ చైతన్య మావయ్య వెంకటేష్ చిన్న గెస్ట్ రోల్లో కనిపించాడు.. ఇప్పుడు తాజాగా ఈ మామ అల్లుళ్లు కలసి ఒక మూవీ చేయనున్నారు.. జై లవ కుశ మూవీ తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది.. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..పూర్తి కామెడీ చిత్రంగా రూపొందే ఇందులో వెంకీ సరసన హ్యూమా ఖురేషి నటిస్తుండగా, చైతూకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తొలి షెడ్యూల్ ను పొలాచ్చిలో తీయనున్నారు.. దీని కోసం ఆగస్ట్ తొలివారంలో వెంకీ, చైతూ తో పాటు చిత్ర యూనిట్ పొలాచ్చికి బయలుదేరనుంది. అక్కడ 8వ తేది నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరపనున్నారు. కాగా ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడని అనుకున్నారు.. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి డిఎస్పీ తప్పుకున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







