బహ్రెయినీ ఎలక్ట్రోలర్ బ్యాటిల్‌లో 17 మంది మహిళలు
- July 30, 2018
రానున్న పార్లమెంటరీ ఎన్నికల కోసం ఇప్పటిదాకా 17 మంది మహిళలు తాము బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం వుంది. మహిళా పార్లమెంటేరియన్లకు సుప్రీం కౌన్సిల్ ఫర్ విమెన్ నేతృత్వంలోని అఫీషియల్ అలాగే సివిల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. 2010 నుంచి 2014 వరకు కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌కి పనిచేసిన మాజీ పార్లమెంటేరియన్ ఎబ్తిస్సామ్ హెజ్రెస్ మరోసారి ఈ ఏడాది కూడా బరిలో నిలుస్తున్నారు. మరో మాజీ ఎంపీ రువా అల్ హేకి కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. సదరన్ గవర్నరేట్ నుంచి ఆమె ప్రాతినిథ్యం వహిస్తారు. గతంలో ఆమె నార్త్ గవర్నరేట్‌లోని ఏడవ నియోజకవర్గం నుంచి పనిచేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధి నుంచి అత్యధికంగా ఆరుగురు అభ్యర్థులు నిలబడుతున్నారు. వీరందరికీ ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్ బలమని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







