కేటీఆర్ ను ఇరకాటంలో పడేసిన ఫొటో

- August 06, 2018 , by Maagulf
కేటీఆర్ ను ఇరకాటంలో పడేసిన ఫొటో

ఫొటోలకు సోషల్ మీడియాలో ఎంత రెస్పాన్స్ ఉంటుందో చెప్పన్నక్కర్లేదు. కొన్ని ఫొటోలు ఊహించని చిక్కుల్లో పడేస్తాయి. సాధారణ వ్యక్తులైతే ఎవరూ పట్టించుకోరు కానీ నటీనటులు, రాజకీయ నాయకులైతే అందరి దృష్టి అటువైపు మళ్లుతుంది. అందులోనూ సెలబ్రిటీల ఫొటోలైతే.. ఇంకేముందే నెట్ జెన్లు వాళ్లకు తోచింది రాసేస్తారు. తాజాగా మంత్రి కేటీఆర్ కు కూడా ఇలాంటి ఇరకాటమే ఒకటి వచ్చిపడింది.

ఒకే ఒక్క ఫొటో మంత్రి కేటీఆర్ ను ఇరకాటంలో పడేసింది. సినిమా ఫంక్షన్లకు కేటీఆర్ హాజరుకావడం సహజం. వాళ్లతో ఫొటోలు దిగడం సాధరణ విషయమే. కానీ ప్రైవేటు ఫంక్షన్ కు వెళ్లిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజుతో ఫొటో దిగారు. ఇక్కడి వరకు తప్పులేదు. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆయన ఓ చెక్కు ఇస్తూ కేటీఆర్ తో ఫొటో దిగారు. ఇప్పుడిదే ఫొటోను పోస్టు చేసి నెటిజన్లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసు మాఫీ కోసమే ఈ చెక్కు తీసుకున్నారా? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.

డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఓ రెండు నెలల పాటు తెలుగు రాష్ట్రాల అటెన్షన్ మొత్తం అటే వెళ్లింది. పూరీతో పాటు టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలు విచారణకు హాజరయ్యారు. అయితే అప్పుడు ఓ ఊపు ఊపేసిన కేసు తర్వాత ఏమైందో.. ఎటు వెళ్లిందో తెలియదు. దాని గురించి ఇప్పుడు చడీ చప్పుడు లేదు. కోర్టులో అఫిడవిట్లు లేవు. ఏమైందంటే ఇంకా బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ రావాలి అంటున్నారు. అలా ఆ కేసు అన్నింటిలాగే మరుగునపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com