3 గంటల్లో 170,000 దిర్హామ్‌ల జరీమానా
- August 06, 2018
ఒకే కారు.. అదీ లాంబోర్గాని.. కేవలం మూడు గంటల్లోనే 170,000 దిర్హామ్‌ల జరీమానాకి గురయ్యింది. కారుని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అతి వేగంతో వెళ్ళడమే దీనికి కారణం. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో అతి ఖరీదైన లాంబోర్గానీ కారుని నడిపాడు ఆ కారు డ్రైవర్. యూరోపియన్ విజిటర్, రెంటెడ్ కారులో ఈ ఫీట్‌కి పాల్పడ్డాడు. షేక్ జాయెద్ రోడ్డుపై ఈ కారు అతి వేగంతో వెళ్తుండడాన్ని రాడార్లు పసిగట్టాయి. ఈ రోడ్డుపై అతి వేగానికిగాను 1.3 మిలియన్ దిర్హామ్‌ల జరీమానా విధించారు. తెల్లవారు ఝామున 2.30 నిమిషాల సమయంలో గంటకు 230 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది ఈ కారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







