బహ్రెయిన్‌లో ఇమామ్ దారుణ హత్య
- August 06, 2018మాస్క్‌లో సీనియర్ ఇమామ్‌గా పనిచేస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా చంపేసిన ఘటన బహ్రెయిన్‌లో వెలుగు చూసింది. బంగ్లాదేశీ వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడ్ని అబ్దుల్జలీల్ హమూద్గా గుర్తించారు. ప్రార్థనల అనంతరం అబ్దుల్జలీల్ ఆచూకీ కన్పించకుండా పోయింది. దాంతో బంధువులు, అబ్దుల్ జలీల్ ఆచూకీ కోసైం పోలీసుల్ని సంప్రదించారు. ఈ కేసు విషయమై స్పందించిన ఇంటీరియర్ మినిస్ట్రీ, ఇమామ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, అల్ మజ్రా ఏరియాలోని స్క్రాప్ యార్డ్ దగ్గర దుండగులు పారేసినట్లు ప్రకటించింది. ఆసియాకి చెందిన 35 ఏళ్ళ వ్యక్తిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా భావించి అరెస్ట్ చేశారు. నిందితుడు మాస్క్‌లో రిసైటర్గా పనిచేస్తున్నాడనీ, అదే మాస్క్‌లో అబ్దుల్ అజీజ్ ఇమామ్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఉచిత వీసాలు ట్రేడ్ చేస్తుండడంతో నిందితుడ్ని ఇమామ్ హెచ్చరించినట్లు, ఆ కారణంగానే ఈ హత్య జరిగిందనీ పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







