డాక్టర్ రాజశేఖర్ తన కూతురికి విలన్..
- December 14, 2015
యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ తన కూతురికి విలన్ అయ్యాడంటే అదేదో నిజ జీవితంలో కాదండి సినిమాలోనే.. ఈ మధ్య హీరోల వారసులే కాదు వారసురాళ్లు కూడా అరంగేట్రం చేసేందుకు ముందు వచ్చారు. స్టార్ ఇమేజ్ కేవలం కొడుకులను హీరోలను చేసేందుకే కాదు కూతుళ్లను కూడా హీరోయిన్స్ చేస్తుందని మెగా వారసురాలు నిహారిక ఋజువు చేసింది. అయితే ఇప్పుడు అదే దారిలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని కూడా హీరోయిన్ గా చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ న్యూస్ ఎప్పుడో బయటకు వచ్చిన దానికి సంబందించిన విషయాలు మాత్రం ఎవరికి తెలియలేదు. అయితే శివాని అరంగేట్రం చేసే సినిమా 'వందకు వంద'. ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేస్తుండటం విశేషం. ఫేడ్ అవుట్ అయిన హీరోలంతా తమకు తగ్గ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ దారిలో ఇప్పటికే జగపతి బాబు రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్తున్నారు. అయితే రాజశేఖర్ ని కూడా చాలా సినిమాలకు విలన్ క్యారక్టర్స్ చేయమని అడిగినా నో చెప్పడంతో ఎవరు అడిగే ప్రయత్నం చేయలేదు. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం డైరక్షన్లో రవితేజ హీరోగా చేస్తున్న ఎవడో ఒకడు సినిమాకు కూడా విలన్ గా రాజశేఖర్ ని అడిగినాలాభం లేకుండా పోయింది. అయితే వీరందరికి కాదని చెప్పిన రాజశేఖర్ తన కూతురిని హీరోయిన్ గా చేస్తున్న సినిమాలో విలన్ గా కనిపించనున్నారట. ప్రస్తుతం రాం గోపాల్ వర్మ పట్ట పగలు సినిమా ఎప్పుడో కంప్లీట్ అయినా రిలీజ్ కు నోచుకోలేదు. ఇక విలన్ గా మారుతున్న రాజశేఖర్ కి కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చి హీరోగా పోయిన క్రేజ్ అంతా యాంగ్రీ విలన్ గా తెచ్చుకోవాలని ఆశిద్దాం. ప్రస్తుతం రెండు మూడు సినిమాలను ఓకే చేసే క్రమంలో వారితో చర్చలు జరుపుతున్నాడు రాజశేఖర్. మరి హీరో టరండ్ విలన్ గా సూపర్ క్రేజ్ సంపాదిస్తాడనే నమ్ముతున్నారు ఫిల్మ్ నగర్ సర్కిల్స్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







