పుట్‌బాల్:1-0తేడాతో ఇరాక్‌పై నెగ్గిన భారత్
- August 07, 2018
అమ్మాన్: అమ్మాన్ వేదికగా జరుగుతున్న ఆసియా అండర్-16 ఛాంపియన్‌షిప్‌లో భారత పుట్‌బాల్ జట్టు అద్భుతం చేసింది. పుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి ఆసియా ఛాంపియన్ అయిన ఇరాక్‌ను 1-0తో ఓడించింది. పుట్‌బాల్‌లో ఏ ఫార్మాట్లోనైనా వయసు పరంగా చూసినప్పటికీ ఇరాక్‌పై భారత్ గెలవడం ఇదే తొలిసారి.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషంలో భువనేశ్ హెడర్ గోల్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాగా, టోర్నీలో భాగంగా అంతకు ముందు జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-2తో ఒడినప్పటికీ, ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగారు.
దీంతో ఈ మ్యాచ్ ఆద్యంతం అధ్బుత ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లు ప్రత్యర్ధి జట్టుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం జాతీయ జట్టు ప్రధాన కోచ్ బిబియానో ఫెర్నాండెస్ మాట్లాడుతూ ఈ విజయాన్ని ఏఐఎఫ్ఎఫ్ అకాడమీకి రాకముందు కుర్రాళ్లకు శిక్షణనిచ్చిన కోచ్‌లకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు.
తమపై నమ్మకం ఉంచిన భారత్ ఫుట్‌బాల్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరాక్‌పై తొలి విజయం సాధించడంపై స్పందిస్తూ "ఫైనలైనా స్నేహపూర్వక మ్యాచైనా చివరి నిమిషంలో గోల్ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే" అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







