యూఏఈ:తొలి వారంలో ఆమ్నెస్టీ పొందిన 10,000 రెసిడెంట్స్‌

- August 08, 2018 , by Maagulf
యూఏఈ:తొలి వారంలో ఆమ్నెస్టీ పొందిన 10,000 రెసిడెంట్స్‌

యూఏఈ:యూఏఈలో ఇటీవల ప్రకటించిన ఆమ్నెస్టీ నేపథ్యంలో తొలి వారం రోజుల్లోనే 10,000 మంది రెసిడెన్స్‌ ఆమ్నెస్టీని వినియోగించుకున్నట్లు జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ (జిడిఎఫ్‌ఆర్‌ఎ) వెల్లడించింది. ఫాలో అప్‌ సెక్టార్‌ ఆఫ్‌ వయోలేటర్స్‌ అండ్‌ ఫారినర్స్‌ ఇన్‌ దుబాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అసిస్టెంట్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ ఖలాఫ్‌ అహ్మద్‌ అల్‌ ఘయిత్‌ మాట్లాడుతూ, మిలియన్ల మొత్తంలో జరీమానాల్ని ఈ వారంలో ఆమ్నెస్టీ కారణంగా రద్దు చేసినట్లు తెలిపారు. 3,422 వీసాల్ని రెన్యూ చేశామనీ, 2,107 స్పాన్సర్‌ అప్లికేషన్స్‌ జారీ చేయడం జరిగిందని వెల్లడించారాయన. దుబాయ్‌లోని అమెర్‌ సెంటర్స్‌లో జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్స్‌ 5,500. 2,809 మంది తమ వీసాల్ని రద్దు చేసుకున్నారు. ఔట్‌ పాస్‌ లేదా తమ స్టేటస్‌ని మాడిఫై చేసుకోకుండానే చాలామంది తమ రెసిడెన్సీని క్యాన్సల్‌ చేసుకుంటున్నట్లు అల్‌ ఘాయిత్‌ చెప్పారు. జిడిఎఫ్‌ఆర్‌ఎ, అప్లికెంట్స్‌ తమ అప్లికేషన్లను పూర్తి చేసి జరీమానాలనుంచి తప్పించుకోవాల్సిందిగా సూచిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com