త్వరలోనే ఇస్రో టీవీ: ఇస్రో ఛైర్మన్ కె.శివన్
- August 12, 2018
త్వరలో ఇస్రో టీవీ ఛానల్ రానుంది. లోక్‌సభ టీవీ తరహాలో ఇస్రో నుండి టీవీ ఛానల్ రానుందని ఆ సంస్థ ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆదివారం బెంగళూరులో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు, నాలుగు నెలల్లో ఇస్రో టీవీ ఛానల్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు చేరవేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా.. రానున్న మూడేళ్లలో 50కీలక ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది యూకేకు చెందిన రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ42 ద్వారా ప్రయోగించనున్నట్లు తెలిపారు. పీఎస్ఎల్వీ-సీ43 ద్వారా 30 వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 3న చంద్రయాన్-2, డిసెంబర్లో ఆదిత్య-ఎల్1 ప్రయోగిస్తామన్నారు. ఒక్క 2019లోనే 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్లు కస్తూరి రంగన్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







