'కలర్స్' స్వాతి పెళ్ళి డిటైల్స్ !
- August 12, 2018
'కలర్స్' స్వాతిగా కొంతకాలం బుల్లి తెరను షేక్ చేసిన స్వాతి ఆతరువాత హీరోయిన్ గా మారి మంచి పేరు తెచ్చుకున్నా క్రేజీ టాప్ హీరోయిన్ గా మారలేకపోయింది. ఆమధ్య ఒక టాలీవుడ్ యంగ్ హీరోతో స్వాతి ప్రేమలో పడింది అని వార్తలు రావడంతో స్వాతి పెళ్లి పై గత కొంత కాలంగా గాసిప్పులు హడావిడి చేస్తూనే ఉన్నాయి.
అయితే ఎవరు ఊహించని విధంగా స్వాతి ఒక ఇంటర్ నేషనల్ విమాన సంస్థకు చెందిన ఒక పైలెట్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వాతి కాబోయే భర్త పేరు వికాస్. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో ఇతడు పైలెట్ గా పనిచేస్తున్నాడు. కొచ్చిన్ ప్రాంతానికి చెందిన ఈ మలయాళ యువకుడుతో స్వాతికి గత కొంతకాలంగా పరిచయం ఉండటంతో ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఎరెంజ్డ్ మ్యారేజ్ గా మారింది.
ఈనెల 30వ తారీఖున హైదరాబాద్ లో స్వాతి పెళ్లి జరగబోతోంది. ఆతరువాత సెప్టెంబర్ 2న కొచ్చిన్ లో వీరి పెళ్ళి రిసెప్షన్ జరుగుతుంది. ప్రస్తుతం వికాస్ మలేషియాలోని జకార్తాలో ఉంటున్న నేపధ్యంలో పెళ్ళి తరువాత స్వాతి మలేషియా వెళ్ళి పోతుందని తెలుస్తోంది.
రష్యాలో పుట్టి తెలుగు సినిమాలతో పాటు దక్షిణాది సినిమాలలో నటించిన స్వాతి చివరకు మలేషియాలో సెటిల్ అవుతూ ఉండటం యాధృశ్చికం అనుకోవాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి