'జిడిఆర్‌ఎఫ్‌ఎ' 1 మిలియన్‌ ఇ-పోర్టల్‌ లావాదేవీలు

- December 15, 2015 , by Maagulf
'జిడిఆర్‌ఎఫ్‌ఎ' 1 మిలియన్‌ ఇ-పోర్టల్‌ లావాదేవీలు
 
 
జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ మరియు పారినర్స్‌ ఎఫైర్స్‌ ఇన్‌ దుబాయ్‌ (జిఆర్‌డిఎఫ్‌ఎ) ఇ-పోర్టల్‌ ద్వారా 1 మిలియన్‌ లావాదేవీలు జరిగినట్లు జిడిఆర్‌ఎఫ్‌ఎ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ మహమ్మద్‌ అహ్మద్‌ అల్‌ మర్రి చెప్పారు. రెసిడెన్సీ ఇన్స్యూరెన్స్‌, వర్క్‌ పర్మిట్స్‌, విజిట్‌ వీసా వంటివన్నీ ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో తమ శాఖ ఎప్పుడూ ముందుంటుందని జిడిఆర్‌ఎఫ్‌ఎ ప్రతినిథులు వెల్లడించారు. జిడిఆర్‌ఎఫ్‌ఎ కార్యాలయానికి వచ్చి, గంటల తరబడి వేచి చూసి పనులు పూర్తిచేసుకునేంత కష్టం ఇప్పుడు లేదనీ, ఇంట్లోంచి, కార్యాలయాల్లోంచి అవసరమైన పనులు పూర్తి చేసుకోగలుగుతున్నామనీ, ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కార్యాలయానికి రావాల్సి వస్తుందని వినియోగదారులు చెప్పారు. ఇ-పోర్టల్‌తో ప్రభుత్వానికీ పని సులువయ్యిందనీ, అలాగే వినియోగదారులకూ మెరుగైన సేవల్ని అత్యంత వేగంగా అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఆన్‌లైన్‌ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నామన్నారు అధికారులు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com