'అరవింద' టీజర్ విడుదల
- August 14, 2018
స్వాతంత్య్ర దినోత్సవ కానుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు , సినీ ప్రేక్షకులకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ కోసం యావత్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియంది కాదు. వారి అంచనాలకు తగ్గట్లే టీజర్ ను కట్ చేసారు డైరెక్టర్ త్రివిక్రమ్. సినిమాలో అసలు సిసలైన యాక్షన్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితే ఈ సినిమా చేసాడని తెలుస్తుంది.
"కంట పడ్డావా..కనికరిస్తానేమో, వెంట పడ్డానా నరికేస్తానేమొబా.అంటూ ఎన్టీఆర్ఇ డైలాగ్స్ చెపుతుంటే దసరా వరకు ఎలా వెయిట్ చేయాలో అర్ధం కావడం లేదు. అంతలా టీజర్ ఉంది. ఈ చిత్రానికి థమన్ అదిరిపోయే మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా.. అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకు టీజర్ చూసి ఎంజాయ్ చెయ్యండి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







