'భారత్' సినిమా కాన్సెప్ట్ టీజర్ విడుదల
- August 15, 2018
'భారత్' కాన్సెప్ట్ టీజర్ విడుదల ముంబయి: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'భారత్'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. దిశా పటానీ సల్మాన్ సోదరిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా..ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్‌ను సల్మాన్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. 'ఈ భూమిపై కొన్ని బంధుత్వాలు ఉంటాయి. మరికొన్ని రక్తసంబంధాలు ఉంటాయి. కానీ నాకు ఆ రెండూ ఉండేవి' అంటూ సల్మాన్ చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో సల్మాన్ ఇంతకు ముందెన్నడూ చూడని ఓ కొత్త అవతారంలో దర్శనమిస్తారని తెలుస్తోంది. భారతదేశ సంస్కృతి, మూలాలను కళ్లకుకట్టేలా 'భారత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో దర్శకుడు జాఫర్ వెల్లడించారు. ఏడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కథ సాగుతుంది. అందులో భాగంగా పలు దేశాల్లో చిత్రీకరణ జరపుతున్నారు. ఓ మనిషి, ఓ జాతి కలిసి చేసే ప్రయాణమే 'భారత్'.
వచ్చే ఏడాదిలో సల్మాన్‌కు బాగా కలిసొచ్చిన రంజాన్ రోజున ఈ చిత్రం విడుదలకానుంది
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







