ప్రభుత్వ లాంఛనాలతో వాజపేయి అంత్యక్రియలు పూర్తి
- August 17, 2018
ఢిల్లీ:మహా మనిషి మళ్లి రా.. అటల్ జీ అమర్ రహే.. అంటూ జననేతకు కన్నీటి వీడ్కోలు పలికింది యావత్ భారత దేశం. మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహరీ వాజ్‌పేయి ఇక తిరిగి రారనే విషయాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. అందుకే వేలాది మంది అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియులు ముగిసాయి.త్రివిధ దళాది పతుల గౌరవ వందనం తరువాత.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తుది వీడ్కోలు పలికారు. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో.. దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ నేతలు.. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తల మధ్య అంత్యక్రియులు ముగిసాయి…
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత ఎల్‌కే అద్వాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్రంమంత్రులు, వివిధ పార్టీల నేతలు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విదేశీ మంత్రులు అంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు..
భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళులు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభమైన అంతిమయాత్రం.. 5 గంటలకు ముగిసింది. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి.. రాష్ట్రీయ స్మృతి స్థల్ వరకు అంతియయాత్రలో దారి పొడవునా అటల్ జీ అమర్ రహే నినాదాలతో మార్మోగిపోయింది. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది.
మోడీకి ఆయన రాజకీయ మార్గదర్శి. అందుకే గురువుగా గౌరవించేవాడు..సోదరుడిలా అభిమానించేవాడు. దివంగత మాజీ ప్రధాని అటల్ జీతో మోడీకి ఉన్న అనుబంధం అది. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు నరేంద్ర మోడీ ఎదుగుదలలో వాజ్ పేయి ప్రభావం ఉంది. ఆయన ప్రొత్సహాం ఉంది. అందుకే వాజ్ పేయి పట్ల ఎల్లప్పుడూ భక్తుడిగా ఉండిపోయాడు మోడీ.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







