‘సైరా నరసింహా రెడ్డి’ టీజర్ విడుదల
- August 20, 2018
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. చిరు పుట్టిన రోజుకు ఒక రోజు ముందే అభిమానులకు పండుగ వాతావరణం తీసుకువచ్చిందీ టీజర్. టీజర్లో సైరా నరసింహారెడ్డిగా చిరు లుక్‌ను రివీల్ చేశారు. అంతేకాదు ఈ యుద్ధం ఎవరిది అంటూ చిరు చెప్పిన డైలాగ్‌తో కట్ చేసిన టీజర్లో భారీ గ్రాఫిక్స్, చిరు గెటప్, సెట్స్ ఇలా అన్ని సినిమాలోని భారీతనాన్ని చూపించేలా రూపొందించారు.
మెగాస్టార్ తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. నయనతార, చిరు సరసన హీరోయిన్గా నటిస్తుండగా తమన్నా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ భారీ చారిత్రక చిత్రాన్ని సంగీతమందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







