యూ.ఏ.ఈ :స్కూల్ ఖర్చుల్లో డిస్కౌంట్ కోసం చూస్తున్న పేరెంట్స్
- August 25, 2018
యూ.ఏ.ఈ:సమ్మర్ ముగుస్తోంది. స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు మార్గాల్ని అన్వేసిస్తున్నారు. యూనిఫామ్‌లు, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, బుక్ బ్యాగ్స్, లంచ్ బాక్స్‌లను కొనుగోలు చేసే క్రమంలో డిస్కౌంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా పరిస్థితులు ఏమంత బాగా లేని ఈ పరిస్థితుల్లో స్కూల్ ఖర్చులలో తగ్గుదల కోసం ప్రయత్నిస్తున్నామని పేరెంట్స్ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి అర్చనా దేశాయ్ మాట్లాడుతూ, తమ పిల్లల్ని స్కూల్‌కి పంపించేందుకు 500 దిర్హామ్‌ల ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. యూనిఫామ్ ధరలు ఎక్కువగా వున్నాయనీ ఆమె అన్నారు. ప్రాచీ సిన్హా అనే హహిళ మాట్లాడుతూ తమ పిల్లల్ని స్కూల్‌కి పంపించాల్సి వుందనీ, డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పలువురు తల్లిదండ్రులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు భారంగా మారుతుండడంతో ఎంతో కొంత ఖర్చులు తగ్గుతాయనే ఆలోచనతో, డిస్కౌంట్ సేల్ కోసం ఎదురుచూస్తున్నట్లు మెజార్టీ పేరెంట్స్ చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







