మళ్ళీ వెంకటేశ్, నయనతారల హిట్ కాంబినేషన్..
- December 16, 2015
లక్ష్మి', 'తులసి' తర్వాత మళ్ళీ వెంకటేశ్, నయనతారల హిట్ కాంబినేషన్లో ఇప్పుడు ఓ కొత్త సినిమా మొదలైంది. మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు స్విచాన్ చేయగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ -''గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ ఇప్పటికే మూడు పాటలకు ట్యూన్లిచ్చారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర హణం: వివేక్ ఆనంద్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







