తెలంగాణ:అప్రమత్తమైన పార్టీలు.. ముందస్తుకు మేము సిద్ధం
- August 28, 2018
తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. పార్టీలు తమ ఫ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న వార్తల నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. సిద్దమని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం… అంతే స్పీడ్ గా అడుగులు వేస్తోంది.
ముందస్తుపై ప్రభుత్వం నిర్ణయం ఎలా వుంటుందన్నదానిపై గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు చర్చించారు. ఒక వేళ ముందస్తు వస్తే పార్టీ ఎలా వ్యవహరించాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలని డిసైడ్ అయ్యారు. సాధ్యమైనంత త్వరగా ప్రచార , మ్యానిఫెస్టో, ఎలక్షన్ కమీటీలను ఏర్పాటు చేసుకోవాలిన నిర్ణయించారు. కాంట్రవర్సీ లేని చోట్ల అభ్యర్థులను ప్రకటించాలని.. మిగతా అభ్యర్థుల ఎంపిక కోసం పీసీసీ సెలెక్షన్ కమీటీని నియమిస్తామని అంటున్నారు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్.
ఇక సెప్టెంబర్ 2న టిఆర్ఎస్ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ. నాలుగున్నర ఏళ్ళుగా కేసీఆర్ అమలు చేయని హామిలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించిన నేతలు.. . ఉత్తర , దక్షిణ తెలంగాణలో సభలను నిర్వహించి.. సోనియా, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని తీర్మానించారు.
నేతలు అందరు సమన్వయంతో ముందుకు వెళ్లాలని .. దీనికోసం రాష్ట్ర స్థాయితో పాటు.. నియోజకవర్గం స్థాయిలో కూడా సమన్వయ కమీటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. మొత్తానికి ముందస్తు కు పార్టీలో లీడర్ టూ.. క్యాడర్ ను సమయాత్తం చేస్తూనే.. గులాబీ బాస్ నుంచి ముందస్తు క్లారీటీ వచ్చే నాటికి సర్వం సిద్దంగా ఉండాలని డిసైడ్ అయ్యింది హస్తం పార్టీ.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







