దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ..
- December 16, 2015
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చరిత్రలో మరో మైలురాయి.. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ ప్రస్థానంలో అపూర్వ ఘట్టం.. స్వదేశీ గడ్డ నుంచి 50 వాహక నౌకలను పంపిన దేశంగా భారత్ ఘనతకెక్కిన సందర్భం.. షార్ నుంచి బుధవారం సాయంత్రం నింగిలోకి పంపిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్సి29(పీఎస్ఎల్వీ) విజయవంతమైంది. సింగపూర్‌కు చెందిన 625 కిలోల బరువు ఉన్న టెలియోస్1తోపాటు మరో ఐదు చిన్న ఉపగ్రహాలను ఇస్రోకు నమ్మినబంటు అయిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్సి29(పీఎస్ఎల్వీ) 550 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టింది. సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 21.2.0 నిమిషాల వ్యవధిలో నిర్ధేశిత కక్ష్యలోకి ఆరు ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ముందుగా 59 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ ముగిసిన అనంతరం పీఎస్ఎల్వీ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం. సింగపూర్ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు అయిన సందర్భంగా సింగపూర్ అంతరిక్ష సంస్థ తాజాగా బుధవారంషార్ నుంచి 400 కిలోల టెలియోస్1 ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టింది. ఇటు ఇస్రోకు ఇది 50వ ప్రయోగం కావడం విశేషం. పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగానికి రూ.175 కోట్లు ఖర్చు చేశారు. సాధారణంగా రాకెట్ నింగిలోకి పంపిన తర్వాత ఉపగ్రహాలు విడిపోతాయి. ఈ దఫా అందుకు భిన్నంగా ఉపగ్రహాలు విడిపోయిన తర్వాత రాకెట్‌లోని నాలుగో దశను కిందకు తీసుకువచ్చారు. 550.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలు విడిపోగా తర్వాత నాలుగో దశ 524.0 కిలోమీటర్ల ఎత్తులో వేరయ్యి 523.9 కిలోమీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది.టెలియాస్1: సింగపూర్ ప్రథమంగా తయారుచేసిన వాణిజ్య ఉపగ్రహం. రిమోట్ సెన్సింగ్ కోసం దీన్ని ప్రవేశపెట్టారు.వెలక్స్సి1 (123 కిలోలు): దీనిని నన్యాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం వారు రూపకల్పన చేశారు. ఇది పర్యావరణాన్ని పరిశీలిస్తుంది.వెలక్స్2 (13 కిలోలు): దీన్నీ నన్యాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం వారే రూపొందించారు. ఇందులో సమాచార పేలోడ్, జీపీఎస్ ఎక్స్పరిమెంటల్ పేలోడ్, ఫాలంట్ టాలరెంట్ పేలోడ్ ఉన్నాయి.అథనోక్సట్: మెక్రో స్పేస్ రాపిడ్ ప్రైవేటు అనే సింగపూర్ సంస్థ తన ప్రయోగశాలలో రూపొందించింది. భూ రిమోట్ సెన్సింగ్ కోసం ఉపయోగిస్తారు.కెంట్రిడ్జ్1 (78 కిలోలు): ఇందులో అత్యాధునిక కెమేరాలు ఉన్నాయి.గలసియా (3.4 కిలోలు): సింగపూర్ పై భాగాన ఐనోస్పియర్‌లో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యను, ఫోటాన్లను కొలుస్తుంది.ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. దీనిని ఖబృహత్కార్యంగగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ప్రయోగం విజయవంతంపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు పీఎస్ఎల్వీసీ29 ప్రయోగం విజయవంతం కావడంపై గవర్నర్ నరసింహన్ ఆనందం వ్యక్తంచేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.రత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ ఏడాది ఐదు ప్రయోగాలు చేసిందని ఆ సంస్థ అధిపతి ఎ.ఎస్.కిరణ్‌కుమార్ చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని చేయనున్నట్టు తెలిపారు. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా సమాచార, నావిగేషన్, భూపరిశీలన ఉపగ్రహాలను పంపుతామని చెప్పారు. రాకెట్ నియంత్రణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మార్చిలోగా ఐఆర్ఎన్ఎస్ఎస్ మూడు ఉపగ్రహాలను నావిగేషన్ వ్యవస్థ కోసం కక్ష్యలో ప్రవేశపెడతామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







