లిబియా శిబిరాల్లో తిండి, నీరు లేక అలమటిస్తున్న శరణార్థులు
- August 30, 2018
ట్రిపోలి:యూరప్ చేరుకుందామని బయలుదేరిన వందలాదిమంది శరణార్ధులు లిబియాలో ప్రభుత్వ అధీనంలోని శిబిరాల్లో చిక్కుకుపోయి తినడానికి తిండి, తాగడానికి నీరు లేకుండా అలమటిస్తున్నారు. వీరిలో ఐదేళ్ళు నిండని చిన్నారులతో సహా మహిళలు పెద్ద సంఖ్యలో వున్నారు. ట్రిపోలిలో ప్రత్యర్ధి వర్గాల మధ్య పోరు ఉధృతం కావడంతో శరణార్ధులు, వలసవాదులను ఎవరూ పట్టించుకునేవారే లేరు. ట్రిపోలికి దక్షిణంగా గల ప్రభుత్వ శిబిరమైన అయిన్ జరాలో వందలాదిమంది ప్రజలు కిక్కిరిసిపోయి వున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్కర్ ఒకరు తెలిపారు. ఆ నిర్బంధ శిబిరంలో దాదాపు 400మందికి పైగా వున్నారు. వారిలో 200మంది వరకు మహిళలు, 200మందికి పైగా పురుషులు వున్నారు. ఐదేళ్ళలోపు చిన్నారులు 20మంది వరకు వున్నారని, వీరు తిండి, నీరు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మరో మూడు శిబిరాల్లో 1500 వరకు వున్నట్లు తెలుస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో కొంతమంది పారిపోగా, మరికొంతమందిని ఇతర శిబిరాలకు తరలించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







