రాజమండ్రిలో హీరో సూర్య ను అడ్డుకున్న అభిమానులు..
- August 31, 2018
తమిళ్ హీరో సూర్య..తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. గజని , వీడోక్కడే, సింగం ఇలా ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల 24 తో ప్రశంసలు అందుకున్న ఈయన..ప్రస్తుతం ఎన్ జీకే అనే సినిమా చేస్తున్నాడు. 7/జి బృందావన్ కాలనీ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వం లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు వచ్చారు. తనకోసం వచ్చారని తెలుసుకున్న సూర్య కార్ వ్యాన్ దిగి ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించి,అభిమానులతో సెల్ఫీలు దిగారు.
సూర్యకి రాజమండ్రిలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చిత్ర యూనిట్ షాక్ అయ్యారట. సెక్యూరిటీ కూడా అభిమానులని అదుపు చేయలేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసినట్టు దర్శకుడు తన బ్లాగ్ ద్వారా తెలియజేశాడు. ఈ చిత్రంలో సూర్య కు జోడిగా రకుల్ ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీ శంకర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







