తమిళ్ సినిమాలో నటించనున్న 'బిగ్ బి'
- August 31, 2018
తెలుగు లో పవన్ కళ్యాణ్ తో ఖుషి, కొమరం పులి మరియు మహేష్ బాబు తో నాని సినిమాలకి దర్శకుడిగా పనిచేసి, అలాగే మహేష్ బాబు స్పైడర్ , విజయ్ అదిరింది సినిమాల్లో విలన్ గా నటించిన ఎస్ జె సూర్య ఉయ్యరంద మనితన్ అనే తమిళ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం బిగ్‌బీని సంప్రదించారు చిత్ర యూనిట్. కథ నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌ని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా చిత్ర పోస్టర్ విడుదలైంది. నా స్నేహితుడు అమితాబ్ బచ్చన్ తమిళ పరిశ్రమకి ఆరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అంతేకాక ఎస్‌జే సూర్య ఈ చిత్రంతో హిందీ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషం. అమితాబ్, సూర్యలకి నా శుభాకాంక్షలు అని రజనీ వీడియోలో తెలిపారు. ఈ విషయాన్ని స్పైడర్ విలన్ ఎస్‌జే సూర్య తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అయితే ఈ సినిమా తమిళం, హిందీ భాషలలో ఒకే సారి విడుదల కానుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఇప్పుడు థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో ముఖ్య పాత్ర చేశారు అమితాబ్. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. అలాగే మన తెలుగు లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిరంజీవి హీరో గా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాల్లో అమితాబ్ రాజ గురువు పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







