ఆసియాకప్‌కు భారత జట్టు ఎంపిక..కోహ్లీ,హార్దిక్ లకు రెస్ట్
- September 01, 2018
ఆసియా కప్‌లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బీసిసిఐ ఇవాళ ప్రకటించింది. బిజీ షెడ్యూల్‌తో కెప్టెన్ విరాట్‌కోహ్లీకి విశ్రాంతినిచ్చి… రోహిత్‌శర్మకు జట్టు పగ్గాలు అప్పగించారు. వచ్చే ప్రపంచకప్ వరకూ తీరికలేని షెడ్యూల్ ఉన్న కారణంగా విరాట్‌కు రెస్ట్ ఇచ్చినట్టు తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగుతేజం అంబటి రాయుడుకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇటీవలే యోయో టెస్ట్ పాసవడంతో రాయుడుకు చోటు దక్కింది.
అలాగే దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తోన్న మనీశ్‌పాండే, కేదార్ జాదవ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరితో పాటు రాజస్థాన్ యువ పేసర్ ఖలీల్ అహ్మద్ తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ధోనీతో పాటు మరో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్‌గా హార్థిక్ పాండ్యా చోటు నిలుపుకోగా… స్పిన్ విభాగంలో యజ్వేంద్ర చహల్,అక్షర్ పటేల్, కుల్‌దీప్‌యాదవ్ ఎంపికయ్యారు.
సెప్టెంబర్ 15 నుంచి యుఎఇ వేదికగా ఆసియాకప్ జరగనుంది. భారత్,పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లతో పాటు మరో క్వాలిఫైయిర్ టీమ్ ఆడనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్,పాక్ సెప్టెంబర్ 19న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి.
భారత జట్టు:
రోహిత్‌శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, అంబటిరాయుడు,మనీశ్ పాండే,కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ( వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్,హార్థిక్ పాండ్యా,కుల్దీప్ యాదవ్, యజ్వేంద్రచహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్,జస్ప్రీత్ బూమ్రా, శార్థూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







