వలసదారుడి ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించిన పోలీసులు
- September 01, 2018
అబుదాబీ నివాసితుడొకరు టెలికమ్యూనికేషన్ టవర్ ఎక్కి, ఆ టవర్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకోగా, పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అతన్ని కిందికి దించారు. ఆ వ్యక్తిని ఆసియాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముసల్లామ్ మొహమ్మద్ అల్ అమెరి మాట్లాడుతూ, టవర్ నుంచి దూకేస్తానని ఆ వ్యక్తి బెదిరించాడనీ, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, అతన్ని బుజ్జగించి కిందికి తీసుకొచ్చారని చెప్పారు. సంఘటన గురించి సమాచారం అందుకోగానే పోలీస్, సివిల్ డిఫెన్స్ మరియు పారామెడిక్స్ని అక్కడికి పంపించారు. గత ఏడాది నవంబర్లో ఓ యంగ్ ఎమిరేటీని కూడా ఇలాగే రక్షించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







