న్యూఢిల్లీని వణికిస్తున్న అకాల వర్షాలు..

- September 01, 2018 , by Maagulf
న్యూఢిల్లీని వణికిస్తున్న అకాల వర్షాలు..

న్యూఢిల్లీ:ఇన్నాళ్లూ కేరళలో బీభత్సం సృష్టించిన భారీవర్షాలు.. ఇప్పుడు దేశరాజధానిని వణికిస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

ఢిల్లీలో కురుస్తున్న అకాల వర్షాలతో.. ఐరన్‌ బ్రిడ్జి దగ్గర నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. యమునా మార్గ్‌, ఎంజీఎం రింగ్‌రోడ్‌ సహా వికాస్‌మార్గ్‌లోని ఐపీ బ్రిడ్జి ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరడంతో.. ట్రాఫిక్‌ నియంత్రణ కష్టంగా మారింది. పలు రూట్లలో ట్రాఫిక్‌ను పోలీసులు దారి మళ్లించారు. ప్రమాదకరమైన ప్రాంతాల వైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షం కారణంగా.. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఇప్పటికే ఢిల్లీలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు.. ట్రాఫిక్‌ అలెర్ట్‌ ప్రకటించారు. మరో 24 గంటల గడిస్తే తప్ప.. వర్షం తీవ్రతను అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రధాన కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com