భారత్ క్రీడాకారుల జయకేతనం..
- September 01, 2018
భారత్ క్రీడాకారులు.. దేశ గౌరవాన్ని విశ్వవ్యాపితం చేస్తున్న ఆణిముత్యాలు. మారుమూల పల్లెల నుంచి వచ్చినా, అరకొర సౌకర్యాలు అడ్డంకిగా మారినా తమ సత్తా చాటుతూ, మేం భారతీయులం అని సగౌరవంగా ప్రపంచానికి చాటి చెబుతున్నారు. భారత కీర్తి పతాకాలను వినువీధిలో ఎగుర వేస్తున్నారు. ఇండోనేషియాలోని జకర్తా వేదికగా జరుగుతున్న 18వ ఆసియన్ క్రీడల్లో ఇప్పటివరకు గెలుచుకున్న పతకాలు 67.
ఆసియా క్రీడల్లో భారత్ గెలుచుకున్న అత్యధిక పతకాల సంఖ్య ఇదే కావడం విశేషం. 2010 తరువాత ఈ స్థాయిలో పతకాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఆ ఏడాది భారత్ మొత్తం 65 పతకాలు సాధించగా అందులో 14 స్వర్ణపతకాలు గెలిచి ఆరోస్థానంలో నిలిచింది. అప్పటికి రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ ఏడాది 67 పతకాలు గెలుచుకుంది. భారత మహిళా స్వ్వాష్ క్రీడాకారులు మలేషియాపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో స్వర్ణం సాధిస్తే కనుక భారత చరిత్రలోనే అత్యధిక స్వర్ణాలు సాధించినట్లవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల లిస్ట్ చూస్తే..
ఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత్ గెలిచిన మొత్తం పతకాల సంఖ్య 51
1954లో 13 పతకాలు, 1958లో 14 పతకాలు, 1962లో 52 పతకాలు, 1966లో 21 పతకాలు, 1970లో 25 పతకాలు, 1974లో 28 పతకాలు, 1978లో 28 పతకాలు, 1982లో 57 పతకాలు, 1986లో 37 పతకాలు, 1990లో 23 పతకాలు, 1994లో 22 పతకాలు, 1998లో 35 పతకాలు, 2002లో 35 పతకాలు, 2006లో 53 పతకాలు 2010లో 65 పతకాలు, 2014లో 57 పతకాలు గెలుచుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







