టెన్నిస్ స్టార్ ఫెదరర్ కి చుక్కెదురు

- September 04, 2018 , by Maagulf
టెన్నిస్ స్టార్ ఫెదరర్ కి చుక్కెదురు

ఢిల్లీ : ఐదు సార్లు యూఎస్ ఓపెన్ విజేత, స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కు చుక్కెదురైంది. యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో ఓటమి పాలయ్యాడు ఫెదరర్. యూఎస్‌ ఓపెన్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్‌ మిల్‌మాన్‌ సంచలనం సృష్టించాడు. పురుషులు ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో టెన్నిస్‌ దిగ్గజం, నంబర్‌ 2 సీడ్‌ ఆటగాడైన ఫెదరర్‌పై అనూహ్య విజయం సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు జాన్ మిల్ మాన్, ఫెదరర్ ను నాలుగు సెట్లు సాగిన మ్యాచ్ లో ఓడించి సరికొత్త స్టార్ గా నిలిచాడు. తొలి సెట్ ను 3-6 తేడాతో కైవసం చేసుకున్న ఫెదరర్, ఆపై మిల్ మాన్ థాటికి తలొగ్గాడు. వరుసగా మూడు సెట్లను 7-5-, 7-6, 7-6 తేడాతో మిల్ మాన్ గెలిచాడు. క్వార్టర్ ఫైనల్స్ లో మిల్ మాన్, నోవాక్‌ జకోవిచ్‌ తో తలపడనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com