దళితులు అనే పదం వాడొద్దు: ప్రైవేటు చానళ్లకు ఆదేశాలు
- September 04, 2018
న్యూఢిల్లీ: ప్రయివేటు టీవీ చానళ్లు ఇక నుంచి 'దళిత్' అనే పదం ఉపయోగించవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దళిత్‌కు బదులు ఎస్సీ (షెడ్యూల్డ్ క్యాస్ట్) ఉపయోగించాలని సూచించింది.
బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలను ఇచ్చింది. షెడ్యూల్ కులాల ప్రజలను దళితులు అని పిలువవద్దని, ఆ పదం ఉపయోగించడాన్ని ఆపాలని మీడియాకు సూచించాలని ఈ ఏడాది జూన్ నెలలో బాంబే హైకోర్టు.. సమాచార మంత్రిత్వ శాఖను అడిగింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఇటీవల మీడియాకు మార్గదర్శకాలు పంపింది.
దళితులు అనే పదాన్ని వ్యతిరేకిస్తూ పంకజ్ మేశ్రమ్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పదం వాడవద్దని చెప్పింది. అలాగే ఆ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దళిత్ అనే పదానికి బదులు ఆంగ్లంలో షెడ్యూల్ క్యాస్ట్, స్థానిక భాషల్లో ఆ పదానికి అనువాదం ఉపయోగించాలని చెప్పింది.
దళిత్ అనే పదం వాడవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంపై కొన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పదం రాజకీయ ప్రాధాన్యతతో పాటు గుర్తింపుతో కూడుకున్నదని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







