1050 కిలోమీటర్ల నడక: పాకిస్తానీ ఘనత
- December 17, 2015
ఇద్రిస్ 1050 కిలోమీటర్ల దూరం నడిచి రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌కి చెందిన 55 ఏళ్ళ మాలిక్ మహమ్మద్ ఇద్రిస్ 44వ యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఈ ఫీట్ చేపట్టాడు. ఇద్రిస్ 13 రోజుల ప్రయానం సోమవారంతో ముగిసింది. యూఏఈలో 30 ఏళ్ళుగా నివసిస్తున్న ఇద్రిస్కి ఈ నడక ఫీట్ కొత్తేమీ కాదు. ఫజారియా నుంచి అబుదాబీ వరకు గతంలో ఆయన 400 కిలోమీటర్ల దూరం నడిచాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న ఇద్రిస్ డిసెంబర్ 2న హట్టాలో నడక ప్రారంభించాడు. మజీరా, మద్దమ్, కల్బా, ఫజారియా, ఖోర్ ఫాకన్ మరియు దిబ్బాల మీదుగా నడక సాగించాడు. రస్ అల్ఖైమాస్లోని వాదిస్ మరియు హిల్స్ ద్వారా ఉమ్ అల్ ఖెవైన్, అజ్మాన్ షార్జా, దుబాయ్‌లలోనూ నడిచాడు. రోజుకు అరవై కిలోమీటర్ల దూరం నడక సాగించాడు ఇద్రిస్. 2016లో దుబాయ్ నుంచి లండన్ వరకు సుమారు 5000 కిలోమీటర్ల దూరం నడక మార్గంలో ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎనిమిది నెలల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాడట.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







