బోల్డ్ లుక్ తో అమలాపాల్ రీ ఎంట్రీ
- September 05, 2018
తెలుగులో స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అమలాపాల్. ఆ తరువాత తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుంది. ఇక అమలాపాల్ సినీ కెరీర్ ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో వారి మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో కొంతకాలానికే విజయ్ నుంచి విడాకులు తీసుకొని మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేసేస్తోంది ఈ భామ. అయితే తాజాగా తమిళంలో అమలాపాల్ నటిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 'ఆడై' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వి. స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రత్నకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆడై' చిత్రం ఫస్ట్ లుక్ ను చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. చిరిగిన దుస్తులతో, అర్ధనగ్నంగా చాలా బోల్డ్ గా కన్పిస్తోంది అమలాపాల్ ఈ ఫస్ట్ లుక్ లో. ఇటీవల కాలంలో ఏ హీరోయిన్ కూడా ఇంత బోల్డ్ గా కన్పించలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా తెలుగులో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రానా విడుదల చేశారు.
సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది అంటూ ట్వీట్ చేశారు రానా. తమిళంలో వెంకట్ ప్రభు ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







