ఆమ్మో! అనిపిస్తున్న "దేవదాసు" శాటిలైట్ రైట్స్

- September 05, 2018 , by Maagulf
ఆమ్మో! అనిపిస్తున్న

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్, మల్టీస్టారర్ చిత్రాల హావా కొనసాగుతోందని చెప్పాలి… చిత్ర పరిశ్రమలో 'మహానటి' తరువాత అనేక మంది ప్రముఖుల జీవిత కథలు ఆదారంగా వస్తున్నాయి… ప్రస్తుతం అన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.. ఇక ఈ మద్య దర్శకులు కొత్త పాత తరం హీరోలతో కలిసి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.. అటు తెలుగు చిత్ర పరిశ్రమలో 1990 శతాబ్దంలొ లో ఓ వెలుగు వెలిగిన హీరోలతో కుర్ర హీరోలను పరిచయం చేస్తు అనేక సినిమాలు వస్తున్నాయి.. విక్టరి వెంటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'ఎఫ్2', నాగార్జున, నాని నటిస్తున్న చిత్రం 'దేవదాస్' ప్రస్తుతం ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీ రామ్ ఆదిత్య వ్యవహరిస్తున్నాడు..

ఇక ఈ చిత్రంలో నాగార్జున ఓ మాఫియా డాన్ గా కని పిస్తుండగా, ఈయన సరసన కథానాయికిగా ఆకాంక్ష సింగ్ కనిపించనుంది.. మరో స్టార్ హీరో మినిమం గ్యారెంట్ మార్కు సొంతం చేసుకున్న నటుడు న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్నాడు.. ఆయన జోడీగా రష్మిక మందన నటిస్తోంది… ఇక ఇటు నాగార్జునకి .. అటు నానికి ఇద్దరికీ కూడా ఎవరి క్రేజ్ వాళ్లకి ఉండనే వుంది. ఈ కారణంగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు 15 కోట్లు చెబుతున్నారట. ఈ రేటుకు శాటిలైట్ హక్కులు అమ్ముడైతే ఈ ప్రాజెక్టు లాభాల్లో పడినట్టేనని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు… కాగా ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కు, అలాగే ఓ పాట కూడా విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సును రాబట్టింది.. మరి శాటిలైట్ రైట్స్ వల్లనే ఇంత మొత్తం వస్తే ఇక సినిమా ఎంత కలెక్షన్ చేస్తుందో నని ఫిలింనగర్ లో కొందరు అనుకుంటున్నారు… ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com