జేబీ బీభత్సం.. విమానాశ్రయం మూసివేత
- September 05, 2018
కన్‌సాయి: జపాన్‌లో టైఫూన్ జేబీ బీభత్సం సృష్టిస్తోంది. అత్యంత బలంగా వీస్తున్న గాలులకు.. అన్నీ కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కన్‌సాయి ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. ఒసాకా, కోబ్, క్యోటో ప్రాంత వాసులకు ఇదే ప్రధాన విమానాశ్రయం. ఈ రాష్ర్టాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో కట్టిన కన్‌సాయి ఎయిర్‌పోర్ట్.. జేబీ టైఫూన్ ధాటికి దెబ్బతిన్నది. ఎయిర్‌పోర్ట్ బ్రిడ్జ్‌పై ట్యాంక్ సుడులు తిరిగింది. దీంతో ఆ బ్రిడ్జ్ ధ్వంసమైంది. గత 25 ఏళ్లలో ఇంత శక్తివంతమైన టైఫూన్ రావడం ఇదే మొదటిసారి. ఈ టైఫూన్ వల్ల సుమారు 10 మంది మృతిచెందారు. భయానకమైన గాలులకు రూఫ్‌టాప్‌లు లేచిపోతున్నాయి. కొన్ని చోట్ల వాహనాలు కూడా ఎగిరిపోతున్నాయి. అనేక చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కన్‌సాయి ఎయిర్‌పోర్ట్‌ను మానవ నిర్మిత దీవిపై నిర్మించారు. ఈ విమానాశ్రయంలో సుమారు మూడు వేల మంది ప్రయాణికులు చిక్కుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







