స్కూల్ విద్యార్థుల కోసం ట్రాఫిక్ సేఫ్టీ డ్రైవ్
- September 06, 2018
మస్కట్: కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్, ట్రాఫిక్ సేఫ్టీపై తగు చర్యలు చేపట్టారు. 2010లో చేపట్టిన ట్రాఫిక్ అవేర్‌నెస్ కారవాన్ ద్వారా స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. సొసైటీకి చెందిన పలు సెగ్మెంట్స్‌పై ఈ అవగాహన మంచి ప్రభావం చూపుతోంది. ఓ బస్‌లో కంప్యూటర్స్, మరో రెండు బస్సుల్లో లెక్చర్ హాల్స్‌తో ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్‌లో అన్ని వయసుల విద్యార్థులకు వీలుగా కాన్వాయ్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - రాయల్ ఒమన్ పోలీస్‌కి సంబంధించి ట్రాఫిక్ స్కూల్ కూడా ఓ విభాగం. ఇది కేవలం స్కూల్ విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఏర్పాటయ్యింది. ఈ స్కూల్ ద్వారా చాలా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్‌ని విద్యార్థుల కోసం నిర్వహిస్తోంది. రాయల్ ఒమన్ పోలీస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మధ్య సంపూర్ణ అవగాహనతో అవేర్‌నెస్ లెక్చర్స్‌ని ఇటు విద్యార్థులకు, అటు బస్ డ్రైవర్లకు నిర్వహిస్తూ వస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







