దివాలీకి ప్రత్యేక స్టాంపు ను విడుదల చేయనున్న 'యుఎన్ఓ'
- September 10, 2018
హిందువులకు అతి పవిత్రమైన, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను పురస్కరించుకుని వచ్చే నెల ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. సంతోషానికి, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆనందంగా జరుపుకుంటారని, ఈ సందర్భంగా అక్టోబర్ 19న 'హ్యాపీ దీవాలీ' పేరుతో స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ ప్రకటనను స్వాగతించారు. 'ఇది రానున్న దీవాలీకి పసందైన బహుమతి' అని వ్యాఖ్యానించారు. అమెరికాలో దీపావళి వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







